![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjUG35pXV_4jIzhOiFN4Rv9ANlY0fHBFNGoqyQfy1dgVUkud1o18YTV257OhGBtdhkAjKk4JMV9m_8c9PPTNxs1HiLJuH7fXkG0JXXlxC4u9rvgc0QA9NIGZ0VW9fmembPf3BFy7tcNNA/s400/ntr1.jpg)
నిన్న night dinner చేసి.. నిద్ర వచ్చి అలా bed పైన పడుకుంటే ఎందుకో అన్న గారు నా కళ్ళ ముందు కదిలారు... బహుశా ఇది జనవరి నెల కదా.. అందుకేనేమో...అందుకే ఈ article వ్రాయాలి అనిపించింది...వ్రాసాను...దయచేసి ఒక 10 minutes ఈ article చదవడానికి కేటాయించండి... This is my humble request to every one...రెండు సంవత్సరాల తరువాత మళ్ళీ సంక్రాంతికి మన ముందుకు మన నందమూరి సినిమా వస్తున్న శుభ సందర్భంలో అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ... ఒక్కసారి అన్న గారిని తలుచుకుందాం...1923 మే 28 కి ముందు...ఒక తల్లి... ఒక బిడ్డ...
తల్లి: నేను పాఠం చదువుతాను... నువ్వు దానిని తిరిగి చదవాలి...
బిడ్డ: సరే అమ్మా...
తల్లి: రాముడు మంచి బాలుడు...
బిడ్డ: రాముడు మంచి బాలుడు...
తల్లి: రాముడు మంచి బాలుడు...
బిడ్డ: అమ్మా!! రాముడు అంటే ఎవరు??
తల్లి: త్రేతా యుగంలో రవణాసురుడుని అంతం చేయడానికి మహావిష్ణు దాల్చిన అవతారం బాబు.. అయొధ్య మహారాజు దసరధ మహారాజుకి ప్రధమ పుత్రుడు ఈ శ్రీరాముడు బాబు...
బిడ్డ: రాముడు ఎలా ఉంటాడు అమ్మా??
తల్లి: ఎలా ఉంటాడు అంటే మన ఊరు రామాలయాంలో ఉన్నాడు కదమ్మా..
.బిడ్డ: అది కాదు అమ్మా... మీ అమ్మ ఎవరు అని అడిగితే ఇలా ఉంటుంది అని నిన్ను చూపిస్తాను... అలా రాముడు ఎలా ఉంటాడు అంటే ఎవరిని చుపించాలి అమ్మా???
తల్లి: (సమాధానం లేక) అంటే.... రాముడు దేవుడు కదా బాబు... ఇలా ఉంటాడు అని ఎవరికి తెలియదు...
బిడ్డ: దేవుడు అంటే???
తల్లి: దేవుణ్ణి అర్ధం చేసుకునే వయస్సు నీకు ఇంకా రాలేదు బాబు... పెద్దవాడివి ఐతే నీకే అర్ధం అవుతుంది...ఆ తల్లి బిడ్డను నిద్రపుచ్చి...
తల్లి: ఓ దేవా!! ఈ రోజు నా బిడ్డ అడిగిన ప్రశ్నకు సమాధానం లేక మౌనంగానే ఉండిపోయాను... నిజానికి అదే ప్రశ్న నా మనసులో కూడా ఉంది దేవా... దీనికి సమాధానం ఎవరు ఇస్తారు తండ్రి???ఇది అంతా స్వర్గం నుంచి బ్రహ్మ, మహావిష్ణులు చూస్తున్నరు...
విష్ణు: ఓ బ్రహ్మ దేవా!!! బిడ్డ పసివాడు కాబట్టి తల్లిని అడిగాడు... తల్లి మానవ స్త్రీ కాబట్టి నన్ను అడిగింది... కనీ నేను ఎవరిని అడగాలి బ్రహ్మ దేవా?? నిజానికి అదే ప్రశ్న నా మనసున కూడా తొలుస్టోంది... భూలోకంలో రాముడు మంచి బాలుడు అని తలిచే మానవులకు ఆ రాముడి రూపం ఇలా ఉంటుంది... కృష్ణుని రూపం ఇలా ఉంటుంది... అని తెలెయచెప్పేది ఎలా??
బ్రహ్మ: ఓ మహావిష్ణు!!! దేవా!!! దీని కొరకు నీవు ఇంత చింతించుటనేల?? నీ పొలికలతో సరితూగిన మానవుడు ఒకడు మానవజాతిని జన్మించిన యెడల నీ కోరిక తిరునట్లు కాదా దేవా??
విష్ణు: భళా!! బ్రహ్మదేవా భళా!! తక్షణం నీ కార్యాన్ని నువ్వు నిర్వర్తించు... వెంటనే నా పొలికలుతో ఉన్న మానవుడిని తయారు చేసి మానవజాతిన ప్రవేశ పెట్టుము!!!
బ్రహ్మ, విష్ణులు తలచినట్టు 1923 మే 28 న సాయంత్రం 4:23 నిమిషములకు.. ఆంధ్ర ప్రదేశ్, కృష్ణా జిల్లా, నిమ్మకూరులో ఆ మహాత్ముడు జన్మించాడు...ఆ తల్లితండ్రులు.. ఆ మహాత్మునికి తారక రామారావు అని నామకరణం చేసారు...మళ్ళీ బ్రహ్మ, మహావిష్ణువుల మధ్య ఈ సంభాషణ...బ్రహ్మ: ఓ మహావిష్ణు!!! రాముడు ఇలనే ఉంటాడు.. కృష్ణుడు ఇలానే ఉంటాడు... అని మానవులకు తెలిసేలా చేసేది ఎలా??విష్ణు: (చిరునవ్వులు చిందిస్తూ...) ఓ బ్రహ్మదేవా!!! జరగబోయేది చూడుడు..బహుశా విష్ణు మాయ అంటే ఇదేనేమో...అనుకోకుండా... రామారావు గారు 1949లో "మనదేశం" చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేసారు... అలా సినీరంగ ప్రవేశం చేసిన ఆయన, సినీజీవితంలో ఎన్నోసార్లు రాముడు, కృష్ణుడి పాత్రలు ధరించి మానవులను అలరించారు... అలా మహావిష్ణువు కోరిక తీరింది.. దనితో 1923 కి ముందు ఈ కథలో ఆ పసివాడు అడిగిన "రాముడు అంటే ఎలా ఉంటాడు??" అనే ప్రశ్నకు సమాధానం దొరికింది...ఆనాటి నుండి మానవులు "రాముడు అంటే ఇలా ఉంటాడా!!", "క్రిష్ణుడు అంటే ఇలా ఉంటాడా!!" అని అనుకోలేదండి.. "రాముడు అంటే ఇలానే ఉంటాడు!!", "కృష్ణుడు అంటే ఇలానే ఉంటాడు!!" అనుకోవడం మొదలుపెట్టారు.. ఈ నాటికి మనం కళ్ళు మూసుకుని రాముడుని తలుచుకుంటే మన మదిలో మెదిలే ఒకే ఒక్క రూపం "నందమూరి తారక రామారావు" గారిది.. కాదంటారా??ఏ రక్తసంబంధం లేక పోయినా ఆయనను చూసి ఆంధ్రదేశం అంతా "అన్న" అని పిలిచింది...మద్రాసు లో ఉన్న తెలుగు సినీ పరిశ్రమని ఆంధ్రప్రదేశ్ కి తిసుకురావడనికి ఆయన కృషి మాటలలో చెప్పలేనిది...సినీరంగానికి ఆయన సేవలకు గాను సినీరంగం "విశ్వవిఖ్యాత నటసౌర్వభూమ నటరత్న"గా అభివర్ణించి కీర్తిస్తే, 1968 లో "పద్మశ్రీ" తో సత్కరించింది "భారతదేశ ప్రభుత్వం"..సినీరంగంలో ఎనలేని సేవలు అందించి... ప్రజాసేవ చేయడానికి రాజకీయ బాట పట్టిన మహానుభావుడు...ఢిల్లీ వీధుల్లో తెలుగు తల్లి దిక్కు తోచని స్థితిలో ఉన్నప్పుడు....తెలుగు వాడి ఆత్మగౌరవం దెబ్బతిన్నప్పుడు...సాటి తెలుగు వాడు "నేను తెలుగు వాడిని" అని చెప్పుకోడనికి సిగ్గు పడుతున్నప్పుడు...ఆ మహాత్ముని హృదయం విలవిలలాడింది...ఆ మహాత్ముని హృదయం చలించింది...ఆ మహాత్ముని హృదయం స్పందించింది...ఆ కసితో... 1982 లో "తెలుగుదేశం" పేరుతో పార్టీను స్థాపించి... ఆ కృషితో తెలుగు వాడి వాడిని వేడిని ప్రపంచానికి చాటింది... ఆ హృదయం...ఈ రోజు ప్రతీ తెలుగు వాడికి ప్రపంచంలొనే ఒక గౌరవం సంపాదించి పెట్టింది... ఆ హృదయం...ప్రతీ తెలుగు వాడికి "తల ఎత్తి జీవించు తమ్ముడా!!" అని తెలియజేసింది... ఆ హృదయం...ప్రతీ తెలుగు వాడు నేను "తెలుగు వాడి"ని అని గర్వంగా చెప్పుకునే స్థితిలో తెలుగు వాడిని ఉంచింది... ఆ హృదయం...చరిత్రలో... ఆంధ్రప్రదేశ్ అవతరణ కోసం ప్రాణత్యాగం చేసి, చివరకు ఆంధ్రప్రదేశ్ ను సాధించి... ఆంధ్రప్రదేశ్ కి "తండ్రి" అయ్యారు "అమరజీవి పొట్టి శ్రీరాములు"గారు...తెలుగు వాడి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టి, తెలుగు జాతి గొప్పతనన్ని తిరిగితెచ్చి, తెలుగు వాడిని ప్రపంచానికి పరిచయం చేసి... తెలుగు జాతికి, ఆంధ్రప్రదేశ్ కి "అన్న గారు" అయ్యరు.. "విశ్వవిఖ్యాత నటసౌర్వభూమ నటరత్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు" గారు... తెలుగు ప్రజల గుండెల్లో ఆయన స్తానాన్ని సుస్థిరపరుచుకున్నారు... ఈ క్రింది చాలు ఆయన గొప్పతనం చెప్పటానికి.."ఈ మధ్య కాలంలో "అన్న" అనే పిలుపు కోసం చాలా మంది తహతహలాడర్లేండి... కానీ.. తెలుగు ప్రజలు ఛీ... పొమ్మన్నారు"...బహుశా "అన్న" అనే పదం ఆయన కోసమే పుట్టిందేమో...!!!రాజకీయాలలో పేదవాడి ఆకలి తీర్చి, పేదవాడికి ఆయన చేసిన సేవలకు... 1923 కు ముందు ఈ కథలో ఆ పసివాడు అడిగిన "దేవుడు అంటే ఎలా ఉంటాడు అమ్మా??" అనే ప్రశ్నకు, ఆ పసివాడితో పాటూ యావత్ మానవజాతికే సమాధానం దొరికింది... ఆ రోజు నుండి ప్రజలు "దేవుడు అంటే ఇలా ఉంటాడా!!" అనుకోలేదండి... "దేవుడు అంటే ఇలానే ఉంటాడు!!" అనుకోవడం మొదలుపెట్టారు...అలా సుఖ: సంతోషాలతో ఆనందిస్తున్న ప్రజలకు ఒక దుర్దినం... 1996 లో ఇదే జనవరి నెల 18వ తేదిన... ఆ మహాత్ముని గుండె ఆగింది... క్షణాలలో ఆ వార్త ఊరు వాడా పొక్కింది... అంతే...కొన్ని లక్షల కోట్ల గుండె చప్పుళ్ళు శృతి తప్పాయి... ఒక్క క్షణం ఆగిపోయాయి...కొన్ని వందల వేల గుండెలు తిరిగి ఆడలేదు..."అన్న" అనే పిలుపు దూరం అయ్యిందా??? అనే బాధతో, దిగులుతో ఎంతోమంది ఊపిర్లు ఆగిపోయాయి... ప్రాణాలు రాలిపోయయి...తెలుగుతల్లి సైతం కన్నీరు కార్చింది...తెలుగువాడు గుండె పట్టుకుని రోధించాడు...ఎంతోమంది కొత్త దర్శకులు డీలా పడిపోయారు...సహనటులు దు:ఖ సాగరంలో మునిగిపోయారు...తెలుగు సినీ కళామ్మ తల్లి తన "ముద్దుబిడ్డ" దూరం అయ్యాడే అని రోధించింది..."అన్నా" అనే మాట మూగబోయిందా??!! అనుకున్నారు అంతా...ఇంతమంది బాధని చూసి "అన్న గారి" ఆత్మ కూడా క్షోభించింది...అంతా విష్ణుమాయ...ఇదంతా చూసి "మహావిష్ణువు" సైతం చలించాడు...ఇంతమంది ఆవేదన తీర్చడం ఇప్పుడు "మహావిష్ణువు" వంతు అయ్యింది... ఏం చేస్తే వీరి ఆవేదన తీర్చగలం అని ఆలోచించాడు... ఒక ఉపాయం తట్టింది..."అన్న గారి" ఆశ్శిస్సులు ప్రజలతోనే ఉంచితే ఆ ఆవేదన తీరుతుంది కదా అని...అందుకే "అన్న" గారు మనల్ని వదిలి పెట్టిన 86 రొజులకే.... ఒక అద్భుతం జరిగింది...తెలుగు సినీ కళామ్మతల్లికి "రాముడి" రూపంలో ఆమెకు "ముద్దుబిడ్డ"ని పరిచయం చేసిన మహావిష్ణువే.. అదే సినీ కళామ్మ తల్లికి "బాలరాముడి" రూపంలో ఆమెకు "ముద్దుల ముని మనవడు"ని పరిచయం చేసారు..."పెద్దాయన"తో సినిమా చేయలేకపొయామే... అని బాధపడుతున్న దర్శకులకు... ఇదిగో... ఇప్పుడు సిసిమా చేయండి అని ఆ మహావిష్ణువే పంపించిన "బాలరాముడు"ఆ "బలరాముడి"ని చూసి "అన్న" గారే మళ్ళీ వచ్చారా!! అనిపించింది అందరికీ...ఇంత చిన్న వయస్సులోనే సమాజం పట్ల అతనికి ఉన్న బాధ్యత...ఇంత చిన్న వయస్సులోనే అతనికి ఉన్న సామాజిక స్పృహ...కష్టాలలో ఉన్న వాళ్ళకి అతను సహాయం చేస్తూ.. చేయూతను అందించే విధానం చూస్తే...అనుమానం లేదు... అనుమానం వద్దు... "అన్న" గారే మళ్ళీ వచ్చారు!!! అని అనిపించక మానదు..."అన్న" అనే మాట మూగబోలేదు... మరో మారు మ్రోగనుంది... అనిపించకా మానదు...ఇప్పుడే అర్ధం అవుతోంది... అన్నగారు ఆయన మనవడిని పిలిచి "నందమూరి తారక రామారావు" అని ఎందుకు నామకరణం చేసారో!!!ఇప్పుడే అర్ధం అవుతోంది... అన్నగారు మనవడితో "నేను చేయవలసింది నేను చేస్తాను... నువ్వు చేయవలసింది నువ్వు చెయ్యి..." అని ఎందుకు అన్నారో!!"అన్న" గారి అభిమానిని అని చెప్పుకోవడం "అదృష్టం" కాదు.... దేవుడు ఇచ్చిన "వరం"...అన్నగారికి మరణం లేదు అని చెప్పడానికే.. నా ఈ articleఅందుకే ఈ సంక్రాంతికి మన ముందుకు రాబోతున్న "అన్న" గారి సినిమా... "అదుర్స్" అఖండ విజయం సాధించాలి అని కోరుకుంటూ... ప్రపంచంలో ఉన్న ప్రతీ తెలుగు వాడికి... ప్రతీ నందమూరి అభిమానికి... నా తరపున, www.nandamurifans.com, NFDB లో ఉన్న ప్రతీ నందమూరి అభిమాని తరపున ఇవే మా శుభాకాంక్షలు..
Article byHarsha (HarshaNTR)
No comments:
Post a Comment