తెలుగు చలనచిత్ర చరిత్రలో ఎనిమిది చిత్రాలతో.. అవి కూడా వరుసగా విజయాలు సాదించడమంటే మాటలా? అంతకు ముందెప్పుడో దర్శకరత్న డా. దాసరి నారాయణరావు వరుసగా 12 విజయాలందుకున్నారని చెబుతారు. కానీ ఇటీవల కాలంలో ఈ ఫీట్‌ను సాధించిన దర్శకులెవరూ మనకు కనిపించరు.
ఎన్టీఆర్ 'స్టూడెంట్ నెం.1'తో మొదలైన రాజమౌళి దర్శకయాత్ర 'సింహాద్రి' చిత్రంతో జైత్రయాత్రగా మారి.. అప్పటి నుంచి అప్రతిహతంగా కొనసాగుతూనే వుంది. సై, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, మర్యాదరామన్న ఒక సినిమాతో ఒక సినిమాకు పోలిక లేకుండా, రూపొందించిన ప్రతి సినిమాతో సంచలన విజయంసాధించడం ఒక ఎత్తయితే, 'ఎదిగేకొద్ది ఒదిగి ఉండాలన్న' ఆర్యోక్తిని నరనరాన అణువణువునా జీర్ణింపజేసుకుని ఎంతో అణకువగా ఉండడం మరొక ఎత్తు. అటువంటి స్టార్ దర్శకుడు రాజమౌళితో ఎన్టీఆర్ సినమా చేయబోతున్నాడు అంటే సంచలనమే.
తెలుగు చలన చిత్ర చరిత్రలో ‘పాతాళ బైరవి’కి మంచి స్థానం ఉంది. ఇప్పుడా చిత్రాన్ని రీమేక్ చేయడానికి దర్శకుడు రాజమౌళి సన్నాహాలు చేస్తున్నాడని సమాచారం. ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తాడనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇది 3డి ఫిలిం అని సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబందించిన గ్రౌండ్ వర్క్ చేసే పనిలో రాజమౌళి నిమగ్నమై ఉన్నట్లు సమాచారం. అతి త్వరలోనే ఈ చిత్రాన్ని సంబందించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment