Monday, 1 February 2010
అందరి ఆమోదంతో పెళ్లికి అంగీకరించా: ఎన్టీఆర్
హైదరాబాద్: అందరి ఆమోదంతోనే తాను లక్ష్మీ ప్రణతిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించినట్లు ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ ప్రతినిధితో చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ వివాహం విషయాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా ధ్రువీకరించారు. నిజానికి, ఫిబ్రవరి 1వ తేదీన పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటించాలని జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ పెద్దలు అనుకున్నారు. కానీ, ఈలోగానే అది మీడియాకు వెల్లడైంది. దీంతో జూనియర్ ఎన్టీఆర్, చంద్రబాబు అధికారికంగా ధ్రువీకరించారు.కాగా, తన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ కోసం మేలో మంచి ముహూర్తం కోసం ఆయన తండ్రి నందమూరి హరికృష్ణ అన్వేషిస్తున్నారు. వివాహ వేదిక కూడా ఇంకా ఖరారు కాలేదు. ప్రణతి తండ్రి నార్నే శ్రీనివాసరావుది గుంటూరు కావడంతో పెళ్లి గుంటూరులో చేయాలా, హైదరాబాదులో చేయాలా అనే విషయాన్ని ఇంకా తేల్చుకోలేదు. పెళ్లిని కొద్ది మందికి మాత్రమే పరిమితం చేసి, రిసిప్షన్ ను అభిమానుల మధ్య జోరుగా చేసుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. రిసెప్షన్ కు గచ్చిబౌలీ స్టేడియాన్ని గానీ ఎల్బీ స్టేడియాన్ని గానీ, లేదంటే రెండింటిని గానీ ఎంపిక చేసుకోవాలని భావిస్తున్నా
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment