Monday, 1 February 2010

ఎన్టీయార్ ---కళ్యాణ రాముడు























ప్రముఖ సినీ హీరో యన్.టి.ఆర్.వివాహం లక్ష్మీ ప్రణతితో వివాహం జరుగుతుందన్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఆయన వివాహం "మే" 21 వ తేదీన జరుగుతుందని సమాచారం. ఈ తేదీకి ఒక ప్రత్యేకత ఉంది. ఈ జూనియర్ యన్.టి.ఆర్. తాతగారైన విశ్వవిఖ్యాతనటసార్వభౌమ, నటరత్న, డాక్టర్ యన్.టి.ఆర్. గారి వివాహం కూడా బసవరామతారకం గారితో "మే" 21 వ తేదీనే జరిగిందట. తాతగారి వ్చివాహం జరిగిన రోజే, ఆయన పోలికలే కాకుండా ఆయన పేరే పెట్టుకున్న ఆయన మనవడి వివాహం కూడా జరగటం యాద్రుచ్చికమే అయినా విశేషం కదా.
యన్.టి.ఆర్.అభిమానులకు శుభవార్త. యన్.టి.ఆర్. పెళ్ళికొడుకవుతున్నాడు. నారా చంద్రబాబు మేనకోడలు, శ్రీమతి మల్లిక, ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన నార్నే శ్రీనివాసరావుల కుమార్తె 17 యేళ్ళ లక్ష్మీ ప్రణతి తో ఆయన వివాహం జరుగనుంది. లక్ష్మీ ప్రణతి హైదరాబాద్ లోని నాజర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్నది. ఈ వివాహానికి చంద్రబాబు అనుసంధానకర్తగా వ్యవహరించారు. త్వరలో వీరి వివాహానికి నిశ్చయతాంబూలాలు అందుకని, 'మే' నెలలో వీరి వివాహం జరుగుతుందని తెలిసింది.














No comments:

Post a Comment